Maha Kumbh Mela | ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్త జనసంద్రంగా ప్రయాగ్‌రాజ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సంక్రాతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు తరలి రానున్నారు. సుమారు 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇక సోమవారం ఉదయం 8 గంటల వరకు సుమారు 40 లక్షల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో షాహీ స్నాన్ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు. సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు.

కాగా, 45 రోజులపాటు సాగనున్న మహా కుంభమేళాకు యూపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించడంతోపాటు అడుగడుగునా సీసీ కెమెరలాను ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పరిశీలిస్తున్నది. భక్తులకు సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్ వాటర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. 10 వేల ఎకరాల పరిధిలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు 45 వేల మంది పోలీసులను మోహరించారు.
#MahaKumbhMela2025🕉️| Prayagraj, Uttar Pradesh: By 7.30 am today, 35 lakh people have taken a holy dip in Triveni Sangam: Uttar Pradesh Government
(Pic source: Prayagraj District Administration) pic.twitter.com/KwYI5GUbBl
— ANI (@ANI) January 13, 2025
#MahaKumbhMela2025 | Uttar Pradesh: A large number of people arrive in Prayagraj to take a holy dip in Triveni Sangam – a sacred confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati as today, January 13 – Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/pXzeEr4SgF
— ANI (@ANI) January 13, 2025
#MahaKumbhMela2025 | Prayagraj, Uttar Pradesh: Devotees take a holy dip in Triveni Sangam – a sacred confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati as today, January 13 – Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/DRLV5T977q
— ANI (@ANI) January 13, 2025
#MahaKumbhMela2025 | Prayagraj, Uttar Pradesh: Thousands of devotees take a holy dip in Triveni Sangam – a sacred confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati as today, January 13 – Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025
(Source:… pic.twitter.com/HE7sV7qD3C
— ANI (@ANI) January 13, 2025
#WATCH | Prayagraj | Devotees take holy dip in Triveni Sangam – a scared confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati as today, January 13 – Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/Efe6zetUc4
— ANI (@ANI) January 13, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

