హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు మూడు విడుతల్లో మూల్యాంకనం నిర్వహిస్తారు.
మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి 9 వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం పేపర్ల మూల్యాంక నం నిర్వహిస్తారు. ఏప్రిల్ 10 నుంచి 17 వరకు రెండో విడత ఫిజిక్స్, బయాలజీ పేపర్లను, ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మూడో విడుతలో సోషల్ స్టడీస్ పేపర్ల మూల్యాంకనాన్ని చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 15న ఇందిరాపార్క్ వద్ద పోరు దీక్ష చేపడుతామని బీసీ విద్యార్థి సంఘం మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. కాంట్రాక్టర్లకు రూ.70 వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ఫీజుల కోసం రూ.7వేల కోట్లు ఇవ్వడం లేదని మండిపడింది. ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, వచ్చే బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది.