Telugu Student | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు (Telugu Student) అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో స్టూడెంట్ మృతి చెందారు.
కొత్త ఏడాది రోజు (New Year Day)న జర్మనీ (Germany)లో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తెలంగాణ రాష్ట్రం జనగామ (Jangaon) జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన తోకల హృతిక్ రెడ్డి (Thokala Hruthik Reddy)గా గుర్తించారు. అతను ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లినట్లు తెలిసింది. హృతిక్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. హృతిక్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read..
LPG cylinder | కొత్త ఏడాది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
New Year 2026 | కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన ప్రపంచ దేశాలు.. వీడియోలు చూశారా..?
Nitish Kumar | రూ.1.48 కోట్ల ఫ్లాట్, రూ.20,552 నగదు.. ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం