LPG cylinder | కొత్త ఏడాది తొలిరోజే వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు (Oil marketing companies) బిగ్ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరను భారీగా పెంచాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరపై రూ.111 బాదాయి. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1691.50కు పెరిగింది. కోల్కతాలో రూ.1,795, ముంబైలో రూ.1,642.50, చెన్నైలో రూ.1,849.50కి పెరిగింది. అయితే, కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. గత కొన్ని రోజులుగా వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులపై మరింత భారం పడనుంది.
Oil marketing companies have increased the prices of commercial LPG gas cylinders. The rate of the 19 KG commercial LPG gas cylinder has been increased by Rs 111, effective from today, 1st January.
In Delhi, the retail sale price of 19kg commercial LPG cylinder is now Rs 1691.50…
— ANI (@ANI) January 1, 2026
Also Read..