న్యూఢిల్లీ, డిసెంబర్ 31: హ్యుందాయ్ కార్ల ధరలు పెరిగాయి. గురువారం నుంచి అన్ని మాడళ్ల రేట్లు 0.6 శాతం పెరుగుతాయని బుధవారమే సంస్థ ప్రకటించింది. పెరిగిన ఉత్పాదక వ్యయమే ఈ నిర్ణయానికి కారణమని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎక్స్‌షోరూం ప్రకారం హ్యుందాయ్ కార్ల కనిష్ఠ ధర రూ.5.47 లక్షలు, గరిష్ఠ ధర రూ.47 లక్షలుగా ఉన్నాయి.