Tejashwi Yadav | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Election Results) ఎన్డీయే కూటమి తన హవా కొనసాగిస్తోంది. అంచనాలకు మించి ఏకంగా డబుల్ సెంచరీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఘోర పరాజయం పాలయ్యారు. తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఈ ఎన్నికల్లో రాఘోపుర్ (Raghopur) నుంచి బరిలో దిగారు. ఆయన బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే 5 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. పదకొండో రౌండ్ తర్వాత సతీష్ కుమార్‌పై తేజస్వీ 4,829 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
2015 నుంచి తేజస్వీ ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 38 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు ఆయన తల్లిదండ్రులు రబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్ ఇదే స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిగా ఉన్న సతీశ్ కుమార్.. రబ్రీదేవిపై విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు తేజస్వీపై గెలుపు దిశగా పయణిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీయే క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ ఎన్నికల్లో (Bihar Elections) ఎన్డీయే ప్రభంజనం సృష్టిస్తోంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. అంచనాలను మించి డబుల్ సెంచరీని దాటింది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే కూటమి 206 స్థానాల్లో ముందంజలో ఉన్నది. అందులో 14 స్థానాల్లో గెలుపు ఖాయం కాగా.. మిగతా 192 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 29 స్థానాలకే పరిమితమైంది.
Also Read..
Congress | బీహార్‌లో పనిచేయని ఓట్ చోరీ అస్త్రం.. రాహుల్ ఎక్కడ..? అంటూ నెట్టింట పోస్టులు
Mahagathbandhan | ఘోర పరాభవం.. మహాగఠ్‌బంధన్‌కు గతంలోకంటే సగం స్థానాలు కూడా దక్కలేదు..!