కొల్చారం, మార్చి14: ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం బూరుగుపల్లికి చెందిన అమృత్ గౌడ్(50) తన కుమారుడు రిషి వర్ధన్గౌడ్(13), అల్లుడు, బోడ భూపతిపూర్కు చెందిన సాయాగౌడ్(32)తో కలిసి రంగంపేటలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై, బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. రాంపూర్ శివారులోకి రాగానే మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మొయినొద్దీన్ తెలిపారు.