హైదరాబాద్, మార్చి 14 (నమస్తేతెలంగాణ): గుండెజబ్బుతో హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను శనివారం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పరామర్శించారు. వారు ఆ దవాఖాన వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. పరామర్శించిన వారిలో సీపీఎం నేతలు బీ వెంకట్, టీ సాగర్, ఎండీ అబ్బాస్, భూపాల్, ఆర్ వెంకట్రాములు, పీ జయలక్ష్మీ తదితరులు ఉన్నారు.