Tejashwi Yadav | బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ (Tejashwi Yadav)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన సమయంలో అందులోని వస్తువులను తేజశ్వి ఎత్తుకెళ్లారని ఆరోపించింది. ఏసీ, బెడ్స్, సోఫాలు వంటి వస్తువులు బంగ్లా నుంచి మిస్ అయినట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఆర్జేడీ – జేడీయూ – కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తేజశ్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా (Bihar deputy Chief Minister) పని చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పాట్నా (Patna)లోని 5 దేశ్‌రత్న మార్గ్‌లో ఆయనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
ఖాళీ అయిన తర్వాత వెళ్లి చూడగా.. అందులోని పలు వస్తువులు కనిపించకుండా పోయినట్లు బీజేపీ వెల్లడించింది. బెడ్స్, ఏసీ, సోఫా, వాష్ బేషిన్స్, వాష్‌రూమ్‌లోని ట్యాప్స్, పూల కుండీలు, జిమ్ పరికరాలు తీసుకెళ్లిపోయినట్లు ఆరోపించింది. ఏయే వస్తువులు మిస్ అయ్యాయో అందుకు సంబంధించిన జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ దానిశ్ ఇక్బాల్ సోమవారం తెలిపారు.
Also Read..
Coal Mine | బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి
Ratan Tata | ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అస్వస్థత వార్తలను ఖండించిన రతన్ టాటా
Sanjeev Arora | ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు