Ratan Tata | ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి (hospitalised) తరలించారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్వస్థత వార్తలపై రతన్ టాటా స్పందించారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఐసీయూలో చేరిన వార్తలను రతన్ టాటా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రతన్ టాటా పేర్కొన్నారు.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024
Also Read..
Sanjeev Arora | ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
Prakash Raj | పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్రకాశ్ రాజ్ మరోసారి సెటైర్లు
Bigg Boss S8 Telugu | బిగ్ బాస్ రీలోడింగ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది వీళ్లే.!