Bigg Boss Telugu 8 – Wildcard Entries | బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌తో పాటు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గ్రాండ్‌గా ఇచ్చారు. ఇప్పటికే హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల వరుసగా ఎలిమినేట్ కాగా.. ఈ వారం మాత్రం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా ఆదివారం నైనిక ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి ఆరుగురు బయటికి వెళ్లగా ప్రస్తుతం 8 మంది హౌజ్‌లో ఉన్నారు. అయితే ఆదివారం నాడు బిగ్ బాస్ రీ లోడింగ్ అంటూ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నవారిని ( విష్ణు ప్రియ, సీత, పృథ్వీ, యష్మి, ప్రేరణ, నిఖిల్, నబీల్, మణికంఠ) ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ (ఓజీ) అంటూ పేరు పెట్టగా.. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లను రాయల్ క్లాన్‌గా పేరు పెట్టారు. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు అనేది చూసుకుంటే..
ఇక వెల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా.. టాలీవుడ్ నటి హరితేజ(Hariteja) హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా (bigg boss 8 telugu wild card entry) ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో హరితేజ కంటెస్ట్‌గా చేసి ఫైనల్లో 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ భామ ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ టేస్టీ తేజ (Tasty Teja) హౌస్‌లో అడుగు పెట్టాడు. టేస్టీ తేజ సీజన్ 7లో బిగ్ బాస్‌లో కంటెస్ట్‌గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అయిన మరో కంటెస్టెంట్ నయని పావని(Nayani Pavani) తాజాగా వైల్డ్ కార్డు ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అయిన యూట్యూబర్ మెహబూబ్ (Mehaboob dil se) నాలుగో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.
వైల్డ్ కార్డు ఐదో కంటెస్టెంట్‌గా నటి రోహిణి(Rohini) ఎంట్రీ ఇచ్చింది. బీబీ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వచ్చిన రోహిణి.. తన మార్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. హౌస్ నుంచి నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లేడి మళ్లీ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చేసింది. ఆరో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ (Gautham Krishna) అడుగు పెట్టాడు.
ఏడో కంటెస్టెంట్‌గా కమెడియన్ ముక్కు అవినాష్ (Mukku Avinash) హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా వచ్చాడు కమెడియన్ ముక్కు అవినాష్. ఆ సీజన్లోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి అంచనాలకు మించి రాణించాడు. దీంతో మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడంతో అవినాష్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా గంగవ్వ(Gangavva) ఎంట్రీ ఇచ్చింది. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్‌తో తెలంగాణ అంతటా అభిమానులను సంపాదించుకున్న గంగవ్వ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. గత సీజన్లో ఐదు వారాలు ఉన్నా గంగవ్వ తాను హౌజ్‌లో ఉండలేకపోతున్నాని బయటకు వచ్చేసింది. అయితే తాజాగా గంగవ్వ కూడా మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. గతంలో నా అంతటా నేను హౌజ్ నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు బిగ్ బాస్ పంపేవరకు బయటకు వెళ్లను అంటూ గంగవ్వ చెప్పుకోచ్చింది.