Prakash Raj | తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj)కు మధ్య సోషల్ మీడియా వేదికగా మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పు పడుతూ వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌పై ప్రకాశ్ రాజ్ మరోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో పవన్ ఫుట్‌బాల్ (foodball) లాంటివారని అన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటివారు. ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారు. పవన్ చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవు. కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉంది’ అని అన్నారు. పవన్ కల్యాణ్ నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషిస్తారన్నారు. పాలిటిక్స్ అలా కాదని, ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుందని హితవు పలికారు.
Pawan Kalyan is a Football in politics..
Getting kicked by all!– Prakash Raj pic.twitter.com/EGSSZmOpIa
— We Dravidians (@WeDravidians) October 6, 2024
అంతకుముందు.. ఎంజీఆర్‌పై పవన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఉన్నట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేశారు. ‘ఉన్నట్టుండి ఎంజీఆర్‌పై ఎందికింత ప్రేమో.. పైనుంచి ఆదేశాలు అందాయా.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే.
Also Read..
PM Modi: దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలో వీడియో సాంగ్
Zomato CEO | జొమాటో సీఈవోకు చేదు అనుభవం.. మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. 20 వేల మంది నివాసం.. వీడియో వైరల్