Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. 20 వేల మంది నివాసం.. వీడియో వైరల్
Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ (Worlds Largest Residential Building)ను ఎప్పుడైనా చూశారా..? పోనీ ఎక్కడ ఉందో తెలుసా..?
Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ (Worlds Largest Residential Building)ను ఎప్పుడైనా చూశారా..? పోనీ ఎక్కడ ఉందో తెలుసా..? అయితే, ఈ వీడియో మీకోసమే. ‘రీజెంట్ ఇంటర్నేషనల్’ (Regent International).. ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్. ఇది చైనాలోని కియాన్‌జియాంగ్ సెంచురీ నగరంలో (Qianjiang Century City) ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసితులు ఉన్నారు.
675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలుస్తోంది. మొత్తం 39 అంతస్తుల్లో ఈ భవంతిని ఎంతో అద్భుతంగా నిర్మించారు. 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ‘ఎస్’ ఆకారంలో నిర్మించారు. ఇందులో గరిష్ఠంగా 30 వేల మంది నివసించొచ్చు. ఇక ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వసతులను కలిగి ఉండడం మరో విశేషం.
ఇందులో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, స్విమ్మింగ్ పూల్స్, నిత్యవసర దుకాణాలు, సెలూన్లు, పార్కులు.. ఇలా సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. నివాసితులు బిల్డింగ్ కాంపౌండ్ కూడా దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ అందులోనే లభిస్తాయట. ప్రస్తుతం ఈ భవంతిలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు. మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకూ రెంట్ ఉంటుందట. ఈ ఆకాశహర్మ్యం 2013లో ప్రారంభమైనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨 More than 20,000 people are living in this world’s biggest residential building in China. pic.twitter.com/O3nBToayx4
— Indian Tech & Infra (@IndianTechGuide) October 6, 2024
Also Read..
Zomato CEO | జొమాటో సీఈవోకు చేదు అనుభవం.. మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
Mohamed Muizzu | రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
Tirumala | వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

