Tirumala | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన (Kalpavriksha Vahanam) సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనంపై శ్రీవారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది.
మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులు వాహన సేవలను తిలకించి భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి జరగనుం. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి వీక్షించేలా తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also Read..
Zomato CEO | జొమాటో సీఈవోకు చేదు అనుభవం.. మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
Mohamed Muizzu | రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
PM Modi: దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలో వీడియో సాంగ్