Zomato CEO | జొమాటో సీఈవో (Zomato CEO) దీపిందర్ గోయల్ (Deepinder Goyal) డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో ఉన్న సమయంలో తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న ఇబ్బందికర పరిస్థితుల్ని తెలుసుకునేందుకు భార్య గ్రేసియా మనోజ్ (Grecia Munoz)తో కలిసి డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు ఓ మాల్‌కు వెళ్లగా.. అక్కడ ఆయన్ని లిఫ్ట్‌లోకి (Malls Lift) అనుమతించలేదు. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి దీపిందర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners.
What do you think? pic.twitter.com/vgccgyH8oE
— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024
గురుగ్రామ్ (Gurugram)లోని ఓ మాల్లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ లిఫ్ట్‌లోకి తనను అనుమతించలేదని చెప్పారు. మెట్ల మార్గం నుంచే వెళ్లాల్సిందిగా వారు సూచించినట్లు చెప్పారు. దీంతో మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లానని.. ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మెట్ల ద్వారం వద్దే ఎదురుచూడాల్సి వచ్చిందని వివరించారు. పని సమయంలో డెలివరీ పార్టనర్ల (delivery partners) పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ యాజమాన్యాలు కూడా డెలివరీ ఏజెంట్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Also Read..
Mohamed Muizzu | రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
Railway Track | ట్రాక్‌పై ఇసుక కుప్ప.. రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర
Antarctica | అంటార్కిటికాలో పరుచుకుంటున్న పచ్చదనం.. తగ్గుతున్న మంచు విస్తీర్ణం