Sanjeev Arora | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన మరో కీలక నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మనీలాండరింగ్ కేసు (money laundering case)లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా (Sanjeev Arora) నివాసంలో తనిఖీలు చేపట్టారు.
భూ అక్రమాల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ (Punjab)లోని లుథియానాలో గల ఎంపీ నివాసం, కార్యాలయాలతోపాటు బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు ప్రారంభించారు. ఈడీ సోదాలపై ఎంపీ సంజీవ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. సోదాలకు గల కారణాలు తనకు తెలియవని చెప్పారు. చట్టాన్ని అనుసరించే పౌరుడిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ట్వీట్ చేశారు.
కాగా, పలు కేసుల్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలు కీలక నేతలు ఈడీ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ తనిఖీలపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read..
Prakash Raj | పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్రకాశ్ రాజ్ మరోసారి సెటైర్లు
Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. 20 వేల మంది నివాసం.. వీడియో వైరల్
Zomato CEO | జొమాటో సీఈవోకు చేదు అనుభవం.. మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది