Coal Mine | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. బీర్భూమ్ (Birbhum) జిల్లాలోని ఓ బొగ్గు గని (Coal Mine)లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం ప్రకారం.. బీర్భూమ్లోని లోక్పూర్ ప్రాంతంలో ఉన్న గంగారామ్చక్ మైనింగ్ ప్రైవేట్ కొలీరీ (Gangaramchak Mining Private Limited colliery)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Ratan Tata | ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అస్వస్థత వార్తలను ఖండించిన రతన్ టాటా
Sanjeev Arora | ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు