Stock Market | లాభాల్లో స్టాక్ మార్కెట్.. 633 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. మరింత పడిపోయిన రూపాయి విలువ
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి, 76,704.13 వద్ద ముగిసింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి, 76,704.13 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా లాభాలబాట పట్టింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 196.65 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి 23,777.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా మూడోరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో నడవడం విశేషం.
మూడు ట్రేడింగ్ సెషన్లలో కలిపి సెన్సెక్స్ 2,100 పాయింట్లు ఎగిసింది. బుధవారం ఉదయం ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,632.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 0.82 శాతం పెరిగి, 55,326.0 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ రోజు ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77 వేల పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 76,704 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ వరుసగా మూడు రోజులు భారత స్టాక్ మార్కెట్లు లాభాలు చూడటం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా అందుబాటులోకి రావడం వంటివి మార్కెట్ సానుకూలతకు కారణాలు. గత వారం పూర్తి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభం నుంచి లాభాలు పొందడం విశేషం. మరోవైపు భారతీయ కరెన్సీ రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. డాలర్‌తో రూపాయి మారక విలువ నేడు 92.65కు చేరింది. తొలిసారి 92.50 దాటింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 102 డాలర్లుగా కొనసాగుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

