రంజాన్ స్ఫూర్తితో దాతృత్వం
రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. రంజాన్ అంటే ఆకలి ఏమిటో అనుభవించడం.. దాహం ఎంత కష్టమో తెలుసుకోవడం. అదే బాధలో ఉన్నవారిని చూసి మన హృదయం కరిగిపోవడం అని పీవీకే 5 ఇంక్లైన్ గని మేనేజర్ డా.శ్యాం ప్రసాద్ అన్నారు.
– డిఎల్ఆర్ కార్మికులకు రేషన్ కిట్లు
– నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
రుద్రంపూర్, మార్చి 18 : రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. రంజాన్ అంటే ఆకలి ఏమిటో అనుభవించడం.. దాహం ఎంత కష్టమో తెలుసుకోవడం. అదే బాధలో ఉన్నవారిని చూసి మన హృదయం కరిగిపోవడం అని పీవీకే 5 ఇంక్లైన్ గని మేనేజర్ డా.శ్యాం ప్రసాద్ అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పద్మావతి గని ముస్లిం ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని గని పై పని చేస్తున్న డిఎల్ఆర్ కార్మికులకు కుల మతాలకు అతీతంగా ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ప్యాకెట్‌తో పాటు నిత్యావసర సామగ్రిని అందజేశారు. అదేవిధంగా కొత్తగూడెం ప్రాంతంలో నివసిస్తున్న ఒక నిరుపేద కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గని మేనేజర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మానవత్వం, సానుభూతి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించినట్లు తెలిపారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అసలైన సారాంశం మన చుట్టూ ఉన్న వారి ఆకలి తీర్చడంలో, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడంలోనే ఉందన్నారు. అన్ని మతాల బోధనల ప్రకారం ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయాలని సూచించారు. పరస్పర సహకారం, ప్రేమ, దాతృత్వం ద్వారా సమాజంలో ఐక్యత పెంపొందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్.నాగేశ్వరరావు, రమేశ్, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్, చిలక రాజయ్య, హెచ్ఎంఎస్ చిట్టిబాబు, నవీన్, సిఐటియు విజయగిరి శ్రీనివాస్, టీబీజీకేఎస్ గడప రాజయ్య, వెంకటేశ్వర్లు, బిఎంఎస్ ఎస్.నాగేశ్వరరావు, ముస్లిం ఎంప్లాయీస్ సభ్యులు ఎండీ ఆసిఫ్, సవీర్, ఖాజా పాషా, అలీం, తాజు, అమన్, నయీమ్, బషీర్, అజ్మత్, జానీ, సలీం, రఫీ, ఖాజా, అజీమ్ పాల్గొన్నారు.

రంజాన్ స్ఫూర్తితో దాతృత్వం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

