Matthew VanDyke | భారత్‌లో అరెస్టయిన అమెరికా కిరాయి సైనికుడు మ్యాథ్యూ వాన్‌డైక్
Matthew VanDyke | అమెరికా (USA) కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్ (Matthew VanDyke) ను భారత్‌లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భారత్ వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది.
Matthew VanDyke : అమెరికా (USA) కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్ (Matthew VanDyke) ను భారత్‌లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భారత్ వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది.
మాథ్యూ వాన్‌డైక్ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి చెందినవాడు. అతను తనను తాను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తగా, సైనికుడిగా, వార్ కరస్పాండెంట్‌గా, కాలమిస్ట్‌గా వెబ్సైట్లో పేర్కొన్నాడు. ది బాల్టిమోర్ ఎగ్జామినర్ మీడియా సంస్థకు వార్ కరస్పాండెంట్ (యుద్ధవార్తలను కవర్ చేసే జర్నలిస్ట్) గా పనిచేసినప్పుడు.. ఇరాక్‌లో అమెరికా దళాలతో కలిసి ఉన్నాడు. తాను లిబియా విప్లవంలో పాల్గొన్నానని, అప్పుడు పట్టుబడి జైలుశిక్ష అనుభవించానని చెబుతుంటాడు.
అతను ఒక మిలిటరీ కాంట్రాక్ట్ కంపెనీ సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ (SOLI) ను స్థాపించాడు. తన సంస్థ SOLI ఉగ్రవాదం, అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాతున్న వారికి ఉచిత భద్రత, శిక్షణ అందించే లాభాపేక్ష లేని సంస్థ అని పేర్కొన్నాడు. డ్రోన్ వార్ఫేర్ ట్రెయినింగ్, అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నించడం, ఈశాన్య భారత్‌కు సమీపంలో చురుగ్గా ఉన్న సాయుధ గ్రూపులతో సంబంధాల నేపథ్యంలో ఎన్ఐఏ అతడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నేరం కింద కేసు నమోదు చేసింది.
ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించడం, కుట్రపన్నడం వంటి అభియోగాలు నమోదైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి. నిందితులు వేర్వేరు తేదీల్లో సరైన పత్రాలు లేకుండానే భారత్‌లోని మిజోరాం రాష్ట్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మయన్మార్‌లోని సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూప్‌లకు డ్రోన్ వార్ఫేర్ ట్రెయినింగ్ ఇవ్వాలన్నది వీరి లక్ష్యమని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

