న్యూఢిల్లీ: ఇటీవల చేపట్టిన పునర్వ్యస్థీకరణ చర్యలతో టెక్ దిగ్గజం అమెజాన్‌లో భారీ స్థాయిలో ఇంజినీర్లపై వేటు పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 14,000 మందికిపైగా ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, రిటైల్, డివైసెస్, అడ్వైర్టెజింగ్, గ్రాసరీ బిజినెస్‌తో సహా అన్ని విభాగాలపై ఉద్యోగుల ఉద్వాసన ప్రభావం కనిపించింది.
న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ వంటి రాష్ర్టాలలో ఎంత మంది ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించిందీ ప్రభుత్వాలకు సమర్పించిన గణాంకాలలో అమెజాన్ వెల్లడించింది. ఈ రాష్ర్టాలలో తొలగించిన 4,700 మంది ఉద్యోగులలో దాదాపు 40 శాతం మంది ఇంజినీరింగ్ ఉద్యోగులేనని వర్కర్ అడ్జస్టమెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్(వార్న్)లో అమెజాన్ తెలియచేసినట్లు సీఎన్బీఎస్ పేర్కొంది.