న్యూఢిల్లీ : నిద్ర సరిగ్గా పట్టాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి యోగాభ్యాసాలు చేయడం ఉత్తమం. 12కు పైగా దేశాల్లోని 2,500 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. దీనిలో పాల్గొన్నవారంతా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నవారే.
అంతే కాకుండా, వీరిలో అన్ని వయసులవారు ఉన్నారు. చైనాలోని హర్బిన్ స్పోర్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 30 నిమిషాల కన్నా తక్కువ సమయం హై ఇంటెన్సిటీ యోగా చేయాలని, వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే నిద్ర సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.