Tamil Nadu Governer : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీల నుంచి రాజకీయవేత్తల వరకూ అందరూ యోగాసనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు తమ యోగా ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. యోగా డేను పునస్కరించుకొని తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి ( Ravindra Narayana Ravi) ఒక వీడియో విడుదల చేశారు. అలాఅనీ ఆయన మిగతా వాళ్లలా చిన్నపాటి ఆసనాలు, వ్యాయమాలు చేయలేదు. తన వయసు వారు సైతం అవాక్కయ్యేలా ఏకబిగిన 51 పుషప్స్ చేసి ఔరా అనిపించారు.
తద్వారా రాష్ట్రానికి తొలి పౌరుడిగానే కాదు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలోనూ తాను ముందువరుసలోనే ఉంటానని చాటారు. గవర్నర్ ఉత్సాహంగా పుషప్స్ తీస్తుంటే అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇక ఆ వీడియో చూసినవాళ్లు ‘వామ్మో 73 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారేంటీ?’ అని నోరెళ్లబెడుతున్నారు. కొందరేమో ‘మీది మామూలు బాడీ కాదు సార్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
70 வயதில்.. 51 தண்டால்..அசத்திய ஆளுநர் ஆர்.என்.ரவி | Tamil Janam |#governorravi #governor #tamiljanam #rnravi #yogaday #Yoga pic.twitter.com/d2YcvofJcr
— Tamil Janam (@TamilJanamNews) June 21, 2025
పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం మధురైలోని వెలమ్మాల్ విద్యా సంస్థలో యోగా వేడుకల్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ రవీంద్ర నారాయణ రవి తన ఫిట్నెస్తో అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. తెలుపు రంగు టీషర్ట్, నలుపు ప్యాంట్ ధరించిన ఆయన.. ఏమాత్రం అలుపెరగకుండా వరుసగా 51 పుషప్స్ తీశారు. మాజీ ఐపీఎస్ (IPS) అయిన రవీంద్ర నారాయణ తన శిక్షణ కాలం నాటి రోజులను గుర్తు చేస్తూ.. ప్రతి యోగాసనాన్ని పక్కాగా చేసి చూపించారు.
సీఎం స్టాలిన్, గవర్నర్ రవీంద్ర
వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపించిన గవర్నర్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బిహార్‌కు చెందిన రవీంద్ర.. ఫిజిక్స్‌లో మాస్టర్స్ చదివారు. అనంతరం సివిల్స్‌కు సన్నద్దమైన ఆయన 1976లో కేరళ కేడర్‌కు ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. 2021లో రవీంద్రను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్