Israel-Iran | ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి.
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రానికి (nuclear research site) నిలయమైన ఇస్ఫహాన్ (Isfahan) నగరంపై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరిపినట్లు ఇరాన్ తాజాగా పేర్కొంది. అయితే, ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని తెలిపింది. అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో దద్దరిల్లినట్లు తెలిపింది. మరోవైపు ఖొండాబ్ అణు పరిశోధనా రియాక్టర్ సమీపంలోని ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు పేర్కొంది.
మరోవైపు టెహ్రాన్‌లోని డజనుకుపైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని, 120కిపైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది. క్షిపణి భాగాలను తయారుచేసే సైనిక పారిశ్రామిక ప్రదేశాలపైన, క్షిపణి ఇంజిన్ల కోసం ఉపయోగించే ముడి పదార్థాలను తయారు చేసే ప్రదేశాలపైన ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపింది. ఏళ్ల తరబడి వీటిని ఇరాన్ నిర్మించుకుందని, ఇరాన్ రక్షణ శాఖకు, అణు కార్యక్రమానికి ఈ పారిశ్రామిక కేంద్రం అత్యంత కీలకమని తెలిపింది. వీటితోపాటు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందు కోసం అధునాతన ఆయుధాల పరిశోధన, అభివృద్ధి కోసం ఉపయోగించే టెహ్రాన్‌లోని ఎస్పీఎన్డీ కేంద్ర కార్యాలయంపైన కూడా ఫైటర్ జెట్లు దాడి చేశాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్‌లోని మూడు క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది.
Also Read..
Barak System: డీఆర్డీవో అభివృద్ధి చేసిన బరాక్ మిస్సైల్ సిస్టమ్ వాడుతున్న ఇజ్రాయిల్
Israel-Iran | ఇజ్రాయెల్ దురాక్రమణను భారత్ ఖండించాలి : ఇరాన్
Nuclear Talks: దాడులు ఆగేవరకు.. అణు చర్చలు ఉండవు : ఇరాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

