Israel-Iran | ఇజ్రాయెల్ దురాక్రమణను భారత్ ఖండించాలి : ఇరాన్
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి.
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ Israel-Iran) మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించాలని ఇరాన్ దౌత్యవేత్త కోరారు.
ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ.. ‘భారత్ అధికారులతో మేము చర్చలు జరిపాం. ఇజ్రాయెల్-ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరితో ఉంది. ఎందుకంటే రెండు దేశాలతోనూ భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఇరాన్-ఇజ్రాయెల్ సమస్యకాదు. ఒక దేశంపై దురాక్రమణకు సంబంధించిన విషయం. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని ఖండించాలి. గ్లోబల్ సౌత్‌కు ఇండియా లీడర్. ఇజ్రాయెల్ దాడులను న్యూ ఢిల్లీ వ్యతిరేకించాలని ఇరాన్ ఆశిస్తోంది. భారత్‌తోపాటూ ప్రతి దేశం ఇజ్రాయెల్ దాడులను ఖండించాలి’ అని పేర్కొన్నారు.
మరోవైపు జ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో తమ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం వల్ల మూసి ఉంచిన ఇరాన్ గగనతలాన్ని భారత విమానాల కోసం తెరిచింది. ఇరాన్లో చిక్కుకుపోయిన మన విద్యార్థులు, పౌరుల కోసం కేంద్రం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. అందులో భాగంగా సుమారు 1000 మందిని మూడు విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వస్తున్నారు. అందులో మొదటి విమానం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఇరాన్ నుంచి రావాలనుకున్న మన వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Also Read..
Nuclear Talks: దాడులు ఆగేవరకు.. అణు చర్చలు ఉండవు : ఇరాన్
Ayatollah Ali Khameni | ‘మహిళలు పువ్వు లాంటివారు’.. వైరలవుతున్న ఖమేనీ పాత పోస్టులు..!
ఇరాన్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

