Ayatollah Ali Khameni : ఇరాన్ – ఇజ్రాయేల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరుదేశాల సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడుతుండడంతో రెండు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరాన్ మతగురువు, అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khameni)ని అంతమొందిస్తామని ఇజ్రాయేల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖమేనీ పాత పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి. గతంలో ఆయన మహిళల గురించి, పేదరికం గురించి.. స్కూల్ డేస్ గురించి.. నల్లజాతీయులకు మద్దతుగా ఆయన పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
ఇజ్రాయేల్‌తో యుద్ధం ఆగేదిలేదంటున్న ఖమేనీ.. అప్పట్లో పెట్టిన ఈ పోస్ట్‌లు చూసిన చాలామంది ఆయన భిన్న వైఖరికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా 1981లో సేవలందించిన ఖమేనీ ప్రజాకర్షణ కలిగిన నేత. మతగురువుగానూ పేరు, ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన గతంలో మహిళలు పువ్వు లాంటివారని అభిప్రాయపడ్డారు.
2013 సెప్టెంబర్ 16న ఒక పోస్ట్‌లో.. ‘మహిళల అవసరాలు, వాళ్ల ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత పురుషుల మీద ఉంది. మహిళల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు’ అని ఖమేనీ రాసుకొచ్చారు. ‘పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతులు. వాళ్లు తమ తెలివితేటలు, దౌత్య నైపుణ్యంతో పురుషులను నియంత్రించడమే కాదు ప్రభావితం చేయగలరు కూడా’ అని 2015 ఫిబ్రవరి 25 న ఆయన పెట్టిన పోస్ట్‌లోని సారాంశం.
Man has a responsibility to understand #woman’s needs and feelings and must not be neglectful toward her #emotional state
— Khamenei.ir (@khamenei_ir) September 15, 2013
అంతేకాదు.. తాను స్కూల్‌కు వెళ్లిన రోజుల నాటి అనుభవాలను కూడా ఖమేనీ 2013లో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నేను సంప్రదాయ పొడవాటి డ్రస్ ధరించి స్కూల్‌కు వెళ్లేవాడిని. అందరిముందు అలాంటి డ్రస్ వేసుకోవడం ఇబ్బందిగా అనిపించేది. అయితే.. ఆ డ్రస్‌లో అల్లరి చేస్తూ.. అందరితో సరదాగా ఆడుకునేవాడిని’ అని ఆయన ప్రాస్తావించారు. మరొక పోస్ట్‌లో తనకు నవలలు, కవిత్వం మీదున్న ఇష్టాన్ని ఖమేనీ వెల్లడించారు. ‘నేను సినిమా, విజ్యువల్ ఆర్ట్స్‌లో వెళ్లడం లేదు. వాటి మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. కానీ, కవిత్వం, నవల.. వంటివి నాకెంతో ఇష్టం. అవి చదువుతున్నప్పుడు నేను సాధారణ శ్రోతగా ఉండలేను’ అని ఖమేనీ రాసుకొచ్చారు.
I went 2school w/a cloak since1st days;it was uncomfortable 2wear it in front f other kids,but I tried 2make up 4it by being naughty&playful
— Khamenei.ir (@khamenei_ir) September 24, 2013
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్న వెళ, ఈ విద్యార్థులను ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరవాన్కు జూన్ 17న తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. వారిలో 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వారే ఉన్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11:40 గంటలకు మహన్ ఎయిర్‌కు చెందిన విమానంలో 290 మంది ఢిల్లీలో దిగారు.