Operation Sindhu : పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్(Iran)లో చిక్కుకున్న దాదాపు వెయ్యి మంది భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో సురక్షితంగా తరలిస్తున్నారు అధికారులు. టెహ్రాన్ గగనతలాన్ని తెరవడంతో జూన్ 19 గురువారం 110 మంది స్వదేశం రాగా.. శుక్రవారం రాత్రి 11:40 గంటలకు 290 మంది ఢిల్లీలో దిగారు. మహన్ ఎయిర్‌కు చెందిన విమానంలో వీళ్లంతా సొంతగడ్డకు చేరుకున్నారు.
ఇరాన్ – ఇజ్రాయేల్ యుద్ధం కారణంగా సురక్షితంగా వచ్చిన వీళ్లను విమానాశ్రయంలో చూడగానే కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అష్గబాట్ నుంచి మరికొందరు విద్యార్థులతో కూడిన రెండో విమానం శనివారం ఉదయం 10 గంటలకు భారత్‌కు రానుంది.
#OperationSindhu continues.
A special evacuation flight from Ashgabat, Turkmenistan landed in New Delhi at 0300 hrs on 21st June, bringing Indians from Iran home.
With this, so far 517 Indian nationals from Iran have returned home under Operation Sindhu. pic.twitter.com/xYfpoxwJtw
— Randhir Jaiswal (@MEAIndia) June 21, 2025
భారతీయులను మేము మా దేశస్థుల మాదిరిగానే చూస్తాం. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ గగనతలాన్ని మూసేసింది. కానీ, భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినందున వాళ్ల కోసం విమానాలను అనుమతిస్తున్నాం’ అని ఇరాన్ దౌత్య కార్యాలయం నుంచి ఆపరేషన్ సింధు మిషన్‌కు డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న మహ్మద్ జావేద్ హొసేన్ మీడియాకు తెలిపాడు.
#WATCH | Delhi: #OperationSindhu flight carrying 290 Indian nationals evacuated from Iran arrives in Delhi. People raise slogans of ‘Hindustan zindabad’ and ‘Bharat Mata ki Jai’ as they emotionally thank the Indian government for rescuing them and bringing them back safely. pic.twitter.com/9GXTiJ64TR
— ANI (@ANI) June 20, 2025
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్న వెళ.. ఈ విద్యార్థులను ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరవాన్కు జూన్ 17న తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. వారిలో 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వారే ఉన్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.