Padi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్‌కి తరలింపు
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

