Hari Hara Veeramallu | హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. ఆ సినిమాతో పోటీ తప్పదా?
Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాని ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఇప్పటివరకు దాదాపు 13 సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది.
Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాని ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఇప్పటివరకు దాదాపు 13 సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ పోస్టర్ విడుదల చేస్తూ హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు. జూన్ 12న రావల్సి ఉన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వలన వాయిదా పడింది. మరి జూలై 24న తప్పక తీసుకొస్తామని చెబుతుండగా, అదే సమయంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ రిలీజ్ కాబోతుందట.
కింగ్డమ్ మూవీ కూడా పలు మార్లు వాయిదా పడింది. జులై 4న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఆ డేట్ కి రావడం లేదని, జులై 25న చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి ఇదే జరిగితే రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. లేదంటే కింగ్ డమ్ చిత్రాన్ని ఏమైన వాయిదా వేస్తారా అన్నది చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి,జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.
చాలా కాలం క్రితమే సినిమా షూటింగ్ ముగించుకున్నఈ సినిమా విడుదల తేదీపై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది. మొదటగా ఈ చిత్రం మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. అయితే, షూటింగ్ ఆలస్యమవడం, అలాగే థియేట్రికల్ హక్కుల అమ్మకం విషయంలో ఏర్పడిన జాప్యం కారణంగా విడుదల వాయిదా పడింది.ఈ సారి మాత్రం పక్కా చెప్పిన డేట్‌కి విడుదల చేస్తారు అనే టాక్ వినిపిస్తుంది. `హరిహర వీరమల్లు` చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు. బాబీ డియోల్ ఔరంగా జేబ్‌గా నెగటివ్ షేడ్ పాత్ర పోషించనున్నారు. నిధి అగర్వాల్ పవన్‌కి జోడీగా చేస్తోంది. వీరితోపాటు పలువురు భారీ కాస్టింగ్ సినిమాకి పని చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

