Heroine | ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలని నిర్మొహమాటంగా భయటపెట్టేస్తున్నారు. తాజాగా తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తన లవ్ బ్రేకప్ గురించి చెప్పి అందరు అవాకయ్యేలా చేసింది.అలానే తన కెరీర్ పరంగా ఒడిదుడుకులు, సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నానని తెలియజేసింది. ప్రశంసలతోపాటు విమర్శలను సైతం తట్టుకున్నానంటూ పేర్కొంది. అయితే జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం చాలా బాధ పడ్డట్టు చెప్పిన అనన్య నాగళ్ల.. ఆ బాధను తట్టుకోలేకపోయానని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే బ్రేకప్ జరిగింది. అది నా జీవితాన్ని రెండేళ్ల పాటు వెంటాడింది అని చెప్పింది.
ఆ సమయంలో నా బాధని ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. రాత్రిళ్లు మౌనంగా ఏడ్చేదాన్ని. కానీ ఉదయం లేవగానే నా బాధను మరిచి జిమ్‌కు వెళ్లే దానిని. ఇక షూటింగ్‌కి వెళ్లినప్పుడు కారవ్యాన్‌లోకి వెళ్లి ఏడ్చే దానిని. ఆ తర్వాత ఏమి జరగనట్టు కెమెరా ముందుకు వచ్చే దానిని. ఈ విషయం ఎవరితో పంచుకోలేదు. కేవలం నా స్నేహితులకి మాత్రమే తెలుసు. నా వ్యక్తిగత జీవితంలోని సమస్యల ప్రభావం నా పని మీద పడకుండా జాగ్రత్తపడ్డాను అని అనన్య వివరించారు. ఇక తెలుగులో 100 సినిమాల్లో 20 శాతం మాత్రమే తెలుగమ్మాయిలకి ఛాన్స్‌లు వస్తున్నాయి.. ఇక్కడ 20% అవకాశాలు మాత్రమే ఉన్నాయి కదా అని, తమిళం మలయాళం కన్నడ హిందీ ఇండస్ట్రీలకి వెళితే 80% అవకాశాలు వాళ్లు స్థానిక అమ్మాయిలకి ఇస్తారు.. మనకి 20 శాతమే ఇస్తారు.
కాబట్టి దేశం మొత్తంలో ఎక్కడ చూసినా మనం ఆ ఇరవై శాతంలోనే ఆఫర్స్ రాబట్టుకోవాలి అని అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 2018లో మల్లేశం చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించిన అనన్య, ఆ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇక పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ సినిమాతో అనన్యకి మంచి పేరు వస్తుందట.