దుబాయ్, జూన్ 20: ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తూ వేలాదిమంది ఇరాన్ పౌరులు శుక్రవారం టెహ్రాన్‌తోపాటు ఇతర నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చేతిలో ఇరాన్ జెండాలను పట్టుకుని, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇరానియన్లు నిరసనల్లో పాల్గొన్నారు. వేలాది ప్రజలు రాజధాని టెహ్రాన్ వీధుల్లో నినాదాలు చేస్తూ నడుస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.
ఇజ్రాయెల్‌తో ఘర్షణ ప్రారంభమైన తర్వాత మరణించిన ఇరానియన్ కమాండర్ల ఫొటోలను చేతిలో పట్టుకుని కొందరు నిరసనలో పాల్గొన్నారు. ఇరాన్‌ను బలపరుస్తున్న లెబనాన్ ఉగ్రవాద గ్రూపు హిజ్బొల్లా జెండాలను కూడా కొందరు పట్టుకున్నారు. నిరసనకారులు ఇజ్రాయెల్ వ్యతిరేక, బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేస్తున్న దృశ్యాలను ఇరాన్‌కు చెందిన తస్నీమ్ వార్తా సంస్థ ప్రసారం చేసింది.