ఐఐటీ రూర్కీలో క్వారంటైన్లో ఉన్న విద్యార్థి మృతి
ఐఐటీ రూర్కీ |

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఐఐటీ రూర్కీలోని హాస్టల్ గదిలో క్వారంటైన్లో ఉన్న ఎంటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రేమ్‌సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవల హాస్టల్లో పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. మృతుడికి సైతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో నిర్బంధంలో ఉంచగా.. అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఇనిస్టిట్యూట్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత సివిల్ హాస్పిటల్‌కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కరోనా అయితే విద్యార్థి నోటి నుంచి నురగ వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు.
అయితే పోస్టుమార్టం నివేదిక తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని ఐఐటీ మీడియా సెల్ ఇన్చార్జి సోనికా శ్రీవాస్తవ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇటీవల రూర్కీ ఐఐటీకి చెందిన విద్యార్థులు వంద మందికిపైగా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. బుధవారం సైతం రూర్కీ పరిసర ప్రాంతాల్లో కొత్తగా 164 కొవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 46 మంది ఐఐటీకి చెందిన వారు కాగా.. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఉన్నారు. వైరస్ సోకిన వారిని కొవిడ్ కేర్ సెంటర్, హోంఐసోలేషన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్ డాక్టర్ సంజయ్ కన్సల్ తెలిపారు.
ఇవికూడా చదవండి..
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
కుంభమేళా కుదింపు కుదరదు : అధికారులు
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా కేసులు
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

