గురువారం 21 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:27:24

ముంబైలో ఆత్మహత్యాయత్నం..

ముంబైలో ఆత్మహత్యాయత్నం..

అడ్డుకున్న ఐర్లాండ్‌ ఫేస్‌బుక్‌ సిబ్బంది

ముంబై, జనవరి 4: ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముంబైకి చెందిన ఓ యువకుడిని ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్‌ కార్యాలయ సిబ్బంది సమాచారంతో ముంబై పోలీసులు చివరి నిమిషంలో రక్షించగలిగారు. ధూలే ప్రాంతానికి చెందిన హోంగార్డ్‌ కుమారుడు ఆదివారం రాత్రి తన మణికట్టును కత్తితో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసారం చేశాడు. దీన్ని గుర్తించిన ఐర్లాండ్‌ ఫేస్‌బుక్‌ సిబ్బంది.. రాత్రి 8.10 గంటల సమయంలో ముంబై పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అరగంటలోపు ఆ యువకుడున్న లొకేషన్‌ను గుర్తించారు. 9 గంటలకల్లా స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని.. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం సోమవారం అతడిని డిశ్చార్జి చేసినట్టు ఓ అధికారి తెలిపారు. logo