Viral Video | ఉత్తరాద్రి రాష్ట్రాలను భారీ వర్షాలు (heavy rainfall) ముంచెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు నదులు ప్రమాదకరస్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా గంగ, యమున నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. పలువురు స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఈ క్రమంలో అక్కడ ప్రభాష్ నటించిన బాహుబలి చిత్రంలోని శివగామి సీన్ రిపీటైంది. ఆ సినిమాలో శివగామి దేవి (రాజమాత) నీటిలో మునిగిపోతున్న మహేంద్ర బాహుబలిని తన రెండు చేతులతో పైకి లేపి కాపాడటానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అలా చుట్టూ వరద నీటితో నిండిన ప్రాంతం నుంచి ఓ వ్యక్తి తన నెలల పసికందును తన రెండు చేతులతో పైకి ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
वीडियो प्रयागराज के एक दंपति का बताया जा रहा है।प्रयागराज में बाढ़ के चलते शहर की गलियों और सड़कों में इतना पानी भर गया है कि मजबूर माता पिता दहशत में आ कर अपनी संतान को दोनों हाथों में उठाकर ले जा रहे हैं।#Rain #Prayagraj #Flood #viralvideo #uttarpradesh pic.twitter.com/1R1vdJ5Z5B
— The Federal Desh (@thefederal_desh) August 4, 2025
Also Read..
PM Modi | హేమంత్ సోరెన్‌ను ఓదార్చిన ప్రధాని మోదీ.. VIDEO
Elephant | ఆహారం కోసం రోడ్డుపై వెళ్తున్న ట్రక్కులను అడ్డగించిన ఏనుగు.. వైరల్ వీడియో
Air India | విమానంలో బొద్దింకలు.. సారీ చెప్పిన ఎయిర్ ఇండియా