Air India | అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం అనంతరం దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రమాదం తర్వాత నుంచి సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులతో నిత్యం వార్తల్లో నిలిచింది. తాజాగా ఆ సంస్థ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈసారి విమానంలో బొద్దింకలే (Cockroaches) అందుకు కారణం.
శాన్ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా (Kolkata) మీదుగా ముంబైకి వెళ్తున్న AI180 విమానం (San Francisco To Mumbai Flight)లో బొద్దింకలు కనిపించడంతో గందరగోళం నెలకొంది. వీటివల్ల ఇద్దరు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో క్యాబిన్ సిబ్బంది సదరు ప్రయాణికులను అదే క్యాబిన్‌లోని వేరే సీట్లకు మార్చారు. ఆ తర్వాత విమానం ఫ్యూయల్ ఫిల్లింగ్‌కోసం కోల్‌కతాలో ఆగినప్పుడు గ్రౌండ్ సిబ్బంది విమానాన్ని డీప్ క్లీన్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సాధారణంగా తమ సిబ్బంది విమానాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారని, అయితే కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో కీటకాలు విమానంలోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read..
Rajasthan CM | దారి తప్పిన విమానం.. రాజస్థాన్ సీఎంకు తప్పిన ప్రమాదం
Anil Ambani | మరిన్ని కష్టాల్లో అనిల్ అంబానీ.. బ్యాంకులకు ఈడీ లేఖలు
Chain Snatched | మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు