Rajasthan CM | రాజస్థాన్ సీఎం (Rajasthan CM) భజన్ లాల్ శర్మ (Bhajanlal Sharma)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం దారి తప్పింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం పొరపాటున సివిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అయింది (Plane Lands At Wrong Airstrip). ఈ ఘటనకు పైలట్ల (pilots) పొరపాటే కారణమని తేలింది. ఈ ఘటన గత గురువారం రోజు సాయంత్రం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ గత నెల 31న ఢిల్లీ నుంచి ఫలోడికి చార్టర్డ్ 2000 ఫాల్కన్ విమానంలో ప్రయాణించారు. షెడ్యూల్ ప్రకారం ఆ విమానం ఫలోడి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం దానికి సమీపంలోని సివిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అయ్యింది. పైలట్లు వెంటనే తప్పు గుర్తించి విమానాన్ని ఫలోడి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించింది. పైలట్లు రన్‌వేను తప్పుగా గుర్తించడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు DGCA గుర్తించి పైలట్లను ఫ్లయింగ్ డ్యూటీ నుంచి తొలగించింది.
Also Read..
Anil Ambani | మరిన్ని కష్టాల్లో అనిల్ అంబానీ.. బ్యాంకులకు ఈడీ లేఖలు
Chain Snatched | మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు
Ceiling Collapses | పీవీఆర్ సినిమా హాల్లో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు