PM Modi | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (Shibu Soren) ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హేమంత్ సోరెన్‌కు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం హేమంత్ సోరెన్‌ను ఓదార్చారు.
శిబు సోరెన్ మరణవార్త తెలుసుకున్న ప్రధాని ఇవాళ ఉదయం ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ముందుగా శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం సోరెన్ కుటుంబాన్ని పరామర్శించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జార్ఖండ్ సీఎంను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
శిబు సోరెన్ (81) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
#WATCH | Prime Minister Narendra Modi pays tribute to former Chief Minister of Jharkhand, #ShibuSoren at Sir Ganga Ram Hospital in Delhi.
Former Jharkhand CM and JMM founder patron Shibu Soren passed away at the hospital today after a prolonged illness. pic.twitter.com/iIzhBgXo0f
— DD India (@DDIndialive) August 4, 2025
Also Read..
Drunk Army Officer Hits People | తాగిన మత్తులో.. 30 మందిని కారుతో ఢీకొట్టిన ఆర్మీ అధికారి
Banke Bihari Temple: శ్రీకృష్ణుడే తొలి మధ్యవర్తి.. బంకి బిహారీ కేసులో సుప్రీంకోర్టు
Air Vistara flight | ఢిల్లీ-విజయవాడ ఎయిర్విస్తారా విమానంలో సాంకేతిక లోపం