Guwahati | గువాహటిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు దుర్మరణం
అసోంలో (Assam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని (Guwahati) జలక్బారీ (Jalukbari) ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింది.
గువాహటి: అసోంలో (Assam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని (Guwahati) జలక్బారీ (Jalukbari) ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను విద్యార్థులుగా (Engineering Students) గుర్తించారు. వారంతా అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని చెప్పారు.
Assam | At least seven dead and several others injured in a road accident that took place in the Jalukbari area of Guwahati on Sunday late night. pic.twitter.com/5gELk04tCR
— ANI (@ANI) May 29, 2023
లారీ కిందికి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) కుష్తగి తాలూకా (Kushtagi taluk) కల్కేరీ (Kalkeri) గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితులంతా విజయపురాకు చెందినవారని, బెంగళూరుకు (Bengaluru) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ.. తమిళనాడు (Tamil Nadu) నుంచి గుజరాత్ (Gujarat) వెళ్తున్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

