Shivraj Singh | శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పొంచి ఉన్న ముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రత పెంపు
Shivraj Singh | మధ్యప్రదేశ్ (Madhyapradesh) మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chauhan) కు పాకిస్థాన్ (Pakistan) గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.
Shivraj Singh : మధ్యప్రదేశ్ (Madhyapradesh) మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chauhan) కు పాకిస్థాన్ (Pakistan) గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం అందడంతో కేంద్రం ఇప్పటికే ఆయనకు కల్పిస్తున్న జెడ్ ప్లస్ భద్రత (Z+ security) ని మరింత కట్టుదిట్టం చేసింది.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ లక్ష్యంగా చేసుకుందని, ఆయన గురించిన సమాచారాన్ని ఐఎస్ఐ సేకరిస్తున్నట్లు తాము గుర్తించామని పేర్కొంటూ మధ్యప్రదేశ్ డీజీపీకి కేంద్ర హోంశాఖ ఒక లేఖ పంపింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, భోపాల్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను సమీక్షించి పటిష్టం చేశారు. అటు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం వద్ద కూడా భద్రతను పెంచారు.
ప్రస్తుతం ఉన్న భద్రతాసిబ్బందికి అదనంగా మరి కొంతమందిని మోహరించారు. అయితే ఇప్పటికే Z+ సెక్యూరిటీ ఉండగా.. దానిని మరింత పటిష్టం చేయడం కోసం ఎంతమందిని పెంచారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజూ మొక్కలు నాటాలనే తన సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టానని, పచ్చదనం పెంచేందుకు అందరూ కలిసి రావాలని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా భారత్‌లో జెడ్ ప్లస్ కేటగిరీని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగా పరిగణిస్తారు. ఈ కేటగిరీ కింద 10 మందికి పైగా ఎన్ఎస్జీ కమాండోలతోపాటు, మొత్తం 55 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఒక వ్యక్తి భద్రతా విధుల్లో ఉంటారు. ఈ కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లోనూ నిష్ణాతులు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

