Vande Bharat Train | వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. పగిలిని కిటికీ అద్దం
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
కేరళ (Kerala)లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం తిరునావయ-తిరూర్ మధ్య గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారు. రైలు కాసర్గడ్ నుంచి తిరువనంతపురానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాళ్ల దాడితో రైలును తిరూర్ సమీపంలో అధికారులు నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఓ బోగీకి సంబంధించిన కిటికీ అద్దం పగిలినట్లు పేర్కొంది. కాగా, కేరళలో తొలి వందేభారత్ రైలును ఏప్రిల్ 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా, గతంలోనూ వందేభారత్ రైలుపై ఆకతాయిలు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. విశాఖ- సికింద్రాబాద్, ఖమ్మం- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆయా ఘటనల్లో రైలు అద్దాలు బ్రేక్ అయ్యాయి. బెంగాల్లోనూ ఆకతాయిలు వందేభారత్ రైలుపై దాడికి పాల్పడ్డారు.
Also Read..
Met Gala | మెట్ గాలా భళా.. రెడ్‌కార్పెట్‌పై ఆలియా, ఈషా, ప్రియాంక మెరుపులు
Kohli Vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం.. ఇద్దరికీ భారీ ఫైన్
Tihar Jail | తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ.. టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

