Kohli Vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం.. ఇద్దరికీ భారీ ఫైన్
Kohli Vs Gambhir: కోహ్లీ, గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లక్నోతో మ్యాచ్‌లో ముగిసిన తర్వాత.. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ, లక్నో మెంటార్ గంభీర్.. మైదానంలో ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు. కేఎల్ రాహుల్ ఆ ఇద్దర్నీ విడదీశాడు. ఆ ఇద్దరికీ ఐపీఎల్ భారీ ఫైన్ వేసింది.
లక్నో: ఐపీఎల్లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), లక్నో జట్టు మెంటర్ గౌతం గంభీర్(Gautam Gambir) మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ ఇద్దరూ మైదానంలోనే గొడవ పడ్డారు. సోమవారం లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. అయితే విక్టరీ తర్వాత ప్లేయర్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో.. కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఇద్దరూ దూషించుకుంటున్న సమయంలో..ఇరు జట్ల ప్లేయర్లు కూడా వారితోనే ఉండిపోయారు. ఆ ఇద్దర్నీ కేఎల్ రాహుల్ ఆపేందుకు ప్రయత్నించాడు.
హ్యాండ్ షేకింగ్ సమయంలో లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్.. కోహ్లీ వద్దకు వెళ్లి ఏదో మాట్లాడాడు. ఆ టైమ్‌లో గంభీర్ అక్కడకు వచ్చి మేయర్స్‌ను తీసుకువెళ్లాడు. ఆ సమయంలోనే కోహ్లీ, గంభీర్ మధ్య ఘర్షణ మొదలైంది. ఏదో చర్చించుకున్న కోహ్లీ, గంభీర్‌లు ఓ దశలో దూషించుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. గంభీర్‌ను, కోహ్లీని సరేట్ చేసిన రాహుల్ ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటర్‌తో మాట్లాడాడు.
మైదానంలోనే ఘర్షణ పడ్డ లక్నో మెంటర్ గంభీర్, ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు ఫైన్ వేశారు. ఇద్దరు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఇద్దరూ అంగీకరించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఆర్టికల్ 2.21 ప్రకారం ఫైన్ వేశారు. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

