SpiceJet | స్పైస్‌జెట్ (SpiceJet) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్లలో ఒకదానిలో సాంకేతిక సమస్య (technical snag) తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు.
స్పైస్‌జెట్ సంస్థకు చెందిన SG 670 విమానం ఆదివారం రాత్రి ముంబై (Mumbai) నుంచి కోల్‌కతా (Kolkata)కు బయల్దేరింది. అయితే, మరికాసేపట్లో విమానం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనంగా విమానంలోని ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. పైలట్ నుంచి సమాచారం అందగానే ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక, సహాయక బృందాలను రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. అయితే, విమానం రాత్రి 11:38 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
Also Read..
Water Tank | కూలిన 1.38 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్.. నివాసాలను ముంచెత్తిన వరద
Air Pollution | ఢిల్లీలో అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. నగరాన్ని కప్పేసిన పొగమంచు
Online Investment Scam: డేటింగ్ యాప్‌తో పరిచయం.. ఆన్లైన్ స్కామ్.. 1.29 కోట్లు కోల్పోయిన వ్యక్తి