సిమ్లా: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తరలించారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షించింది. చిన్న ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య పరీక్షల కోసం ఐజీఎంసీకి ఆమె వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వైద్య పరీక్షల తర్వాత ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్లినట్లు చెప్పారు.
కాగా, ఐజీఎంసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి ధని రామ్ శాండిల్, ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా ఆసుపత్రికి చేరుకున్నారు. రెండు రోజులు ఉనా పర్యటనలో ఉన్న హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కూడా తన పర్యటన ముగించుకుని సిమ్లాకు తిరిగి వచ్చారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని ఛరాబ్రాలో ప్రియాంక గాంధీ వాద్రాకు వ్యక్తిగత నివాసం ఉన్నది. దీంతో సోనియా గాంధీ విశ్రాంతి కోసం ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. ఆదివారం తిరిగి ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షల కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి ఆమె వెళ్లినట్లు తెలుస్తున్నది.
#WATCH | Himachal Pradesh | Congress Parliamentary Party chairperson Sonia Gandhi leaves from Indira Gandhi Medical College & Hospital in Shimla after her medical examination. She had come here for a routine health check-up due to some minor health issues. pic.twitter.com/OByP3Z8OEA
— ANI (@ANI) June 7, 2025
Also Read: