Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రి (hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ గురువారం అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. పొత్తి కడుపు సంబంధిత కారణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి (Sir Ganga Ram Hospital)లో చేరారు. అక్కడ వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేశారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, సోనియా గాంధీ వయసు ప్రస్తుతం 78 ఏళ్లు. ఇటీవలే పలుమార్లు ఇలా అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం కోలుకుని ఆరోగ్యంతో ఇంటికి చేరారు.
Also Read..
Rekha Gupta | ఒక్కరోజు కాలేదు.. అప్పుడే విమర్శలా..? ఆతిశీకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్
DK Shivakumar | ఆ దేవుడి వల్ల కూడా కాదు.. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యపై డీకే శివకుమార్ వ్యాఖ్య
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?