DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను (infrastructural problems) ఆ దేవుడు కూడా పరిష్కరించలేడని వ్యాఖ్యానించారు.
బెంగళూరు పాలికె కార్యాలయంలో ‘నమ్మ రస్తా’ అనే అంశంపై సెమినార్, వస్తు- చిత్ర ప్రదర్శనను గురువారం డీకే శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు మూడేళ్లలో బెంగళూరును మార్చేస్తామంటే అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. దేవుడు దిగివచ్చినా అంత భారీ మార్పు అసాధ్యమన్నారు. పక్కా ప్రణాళికతో క్రమబద్ధంగా మార్పులు సాధించాలన్నారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యలు, ఆలస్యమవుతున్న మెట్రో విస్తరణ పనులు, తగినంత ప్రజా రవాణా లేకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై ఆయన స్పందిస్తూ.. ‘నగరంలో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను ఆ దేవుడు కూడా రాత్రికి రాత్రే పరిష్కరించలేడు. సరైన ప్రణాళికను రూపొందించి అమలు చేసినప్పుడు మార్పు సాధ్యమవుతుంది’ అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read..
Nandini Milk | వినియోగదారులకు షాక్.. పాల ధరల పెంపుకు కేఎమ్ఎఫ్ ప్రతిపాదన.. లీటరుపై ఎంతంటే..?
Elon Musk | భార్యతో జెలెన్స్కీ ఫొటోషూట్.. పిల్లలు చనిపోతుంటే ఇవేం పనులు అంటూ మస్క్ ఫైర్
Sourav Ganguly: మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కాన్వాయ్‌కు ప్రమాదం