Air India | చెన్నై నుంచి సింగపూర్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య (technical snag) తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి చెన్నైకి దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
170 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం ఉదయం చెన్నై నుంచి సింగపూర్‌కు బయల్దేరింది (Singapore bound flight). అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో విమానాన్ని చెన్నైకి మళ్లించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంజినీర్ల బృందం సమస్యను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, పది రోజుల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది మూడో ఘటన. జనవరి 3న దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్ సిస్టమ్‌లో వైఫల్యం కారణంగా కేరళలోని కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత జనవరి 5న బెంగళూరు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి సమస్యే తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Ravichandran Ashwin | హిందీ జాతీయ భాష కాదు : రవిచంద్రన్ అశ్విన్
Electricity Bill | ఒక నెల కరెంటు బిల్లు రూ. 2,10,42,08,405..!