Ravichandran Ashwin | భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశ్విన్.. హిందీ (Hindi language) జాతీయ భాష కాదని వ్యాఖ్యానించారు (Hindi isnt Indias national language). ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాల స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషల గురించి విద్యార్థులను ప్రశ్నించారు. అయితే, హిందీ భాష గురించి ఒకరిద్దరి నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. దీనిపై స్పందించిన క్రికెటర్.. ‘హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కాగా, రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టెస్టు కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. అతను 106 టెస్టుల్లో 24 యావరేజ్లో 537 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడతను. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో అశ్విన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మేటి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమానంగా నిలిచాడు.
Also Read..
Electricity Bill | ఒక నెల కరెంటు బిల్లు రూ. 2,10,42,08,405..!
Dense fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం