Deepika Padukone | వారానికి 90 గంటల పని.. ఎల్అండ్టీ చైర్మన్ ప్రకటనపై ఘాటుగా స్పందించిన దీపిక పదుకొణె
Deepika Padukone | ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) సైతం ఘాటుగా స్పందించారు.
Deepika Padukone | ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తారు..? ఎంతసేపని భార్య ముఖం తదేకంగా చూడగలరు? ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) సైతం ఘాటుగా స్పందించారు.
సుబ్రహ్మణ్యన్ స్టేట్మెంట్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం షాకింగ్‌గా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌కు #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. తద్వారా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని దీపిక అభిప్రాయం వ్యక్తం చేసింది.
వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్అండ్టీ చైర్మన్
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎల్అండ్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగని సుబ్రహ్మణ్యన్.. వారానికి 90 గంటలు పని చేయాలని సైతం ఆయన సెలవిచ్చారు. తాను ఒక చైనా వ్యక్తితో మాట్లాడానని, చైనా కార్మికులు వారానికి 90 గంటలు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కాబట్టి కొన్ని రోజుల్లో అమెరికాను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్టు సుబ్రహ్మణ్యన్ చెప్పుకొచ్చారు. ‘మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాల్సిందే. ముందుకొచ్చి పని చేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్నచూపు చూసేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.
Also Read..
Electricity Bill | ఒక నెల కరెంటు బిల్లు రూ. 2,10,42,08,405..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

