Electricity Bill | సాధారణంగా కరెంటు బిల్లు (Electricity Bill) ఎంత వస్తుంది.. నెలకు రూ.500 నుంచి రూ.1000 లోపు వస్తుంది. అదే ఏదైనా షాపో, హోటలో, ఫ్యాక్టరీ వంటి వాటికి రూ.5వేల వరకూ రావొచ్చు. అయితే, ఓ వ్యక్తికి ఒక నెల బిల్లు ఏకంగా రూ.200 కోట్లు వచ్చింది. ఇది చూసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో చోటు చేసుకుంది.
హమీర్పూర్ (Hamirpur) జిల్లాలోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన లలిత్ ధీమాన్ (Lalit Dhiman).. ఓ వ్యాపారవేత్త. అతడికి డిసెంబర్ 2024కి సంబంధించిన కరెంటు బిల్లు రూ.2,10,42,08,405 వచ్చింది. ఈ బిల్లు చూసి అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతకు ముందు నెల కేవలం రూ.2,500 మాత్రమే కరెంటు బిల్లు చెల్లించాడు. ఇంతలోనే ఇంత మొత్తంలో బిల్లు చూసి అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయంపై వెంటనే విద్యుత్ బోర్డు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదును పరిశీలించగా.. సాంకేతిక లోపం కారణంగా అధిక విద్యుత్ బిల్లు వచ్చినట్లు గుర్తించారు. డిసెంబర్ నెల కరెంట్ బిల్లు రూ.4,047గా తెలిపారు. దీంతో అతడు ఊపిరిపీల్చుకున్నాడు.
Also Read..
Dense fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
Tirumala | గోవిందనామస్మరణతో మారుమ్రోగిన తిరుమల.. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
Yadagirigutta | ముక్కోటి పర్వదినం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం