తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల (Tirumala) దివ్యక్షేత్రం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. రాజకీయ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామిని (Lord Venkateswar ) దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darsan) తెల్లవారుజాము నుంచే ప్రారంభం కాగా ముందుగా వీఐపీలకు దర్శనం కల్పించిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి టోకెన్లు గల భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Dattatreya), కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కుటుంబ సభ్యులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad), డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుందర, బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ (Gopichand), ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.